
జనరల్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని తెలిపారు. ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలోనే పోరాడతానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని దానం నాగేందర్ చెప్పారు.
తీర్పు అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లు దానం నాగేందర్ తెలిపారు. తాను ఫైటర్‌నని, పోరాటం కొనసాగిద్దామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టి, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!