19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యోగా ప్రాధాన్యంపై గవర్నర్ కీలక పిలుపు

Writer: Shivani K 01:29 PM, 20 జూన్, 2026
యోగా ప్రాధాన్యంపై గవర్నర్ కీలక పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు, యోగా గురువులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం-మనసు-ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని అన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల శక్తిని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని గవర్నర్ కొనియాడారు. భారతీయుల ప్రాచీన వారసత్వమైన యోగా నేడు ప్రపంచానికి ఆరోగ్యం, మానసిక సమతుల్యత సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.

తన ప్రసంగంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతమైన సమాజంతోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొంటూ, "యోగతో ఆరోగ్యం, యోగతో సమతుల్యత, యోగతో ఆత్మబలం" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

ట్యాగ్లు
యోగా దినోత్సవంశివ ప్రతాప్ శుక్లాతెలంగాణ గవర్నర్యోగాహైదరాబాద్కిషన్ రెడ్డిపరేడ్ గ్రౌండ్స్అంతర్జాతీయ యోగా దినోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!