
క్రీడలు

నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడులోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. ఇటీవల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!