

వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బీబీనగర్ గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు సెలవు రోజు కావడంతో పాటు, గ్రామాల్లో బోనాలు, ఇతర పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
ఇక హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైనా వాహనాల రద్దీ అధికంగా ఉంది. రాఖీ పండగ సెలవుల అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ప్రజలతో చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫ్లైఓవర్, రోడ్డు మరమ్మతు పనులు కూడా వాహనాల రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయి. ట్రాఫిక్‌ను త్వరగా క్రమబద్ధీకరించి వాహనదారులకు ఇబ్బందులు తగ్గించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!