

నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో త్రిశూలి లోయలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఓ పాఠశాల క్షణాల్లోనే బురద, రాళ్ల ప్రవాహంలో చిక్కుకుంది. ఆ సమయంలో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో 1,643 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 9:20 గంటలకు ఎగువ ప్రాంతంలోని గ్రామం కొట్టుకుపోయిందన్న హెచ్చరిక అందుకున్న ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ వెంటనే పాఠశాల గంట మోగించి తరగతులను ఖాళీ చేయించారు. బస్సులను వెనక్కి మళ్లించడంతో పాటు విద్యార్థులను కొండపైకి తరలించారు. భయంతో స్పృహ తప్పిన ఓ విద్యార్థినిని బైక్‌పై సురక్షిత ప్రాంతానికి తరలించగా, మిగిలిన వారందరూ సురక్షితంగా కొండపైకి చేరుకున్నారు.
విద్యార్థులంతా సురక్షిత ప్రదేశానికి చేరుకున్న కొద్ది నిమిషాలకే భారీ వరద పాఠశాల భవనాన్ని పూర్తిగా ముంచెత్తింది. ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి కారణంగా 1,643 మంది విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్, పాఠశాల వాచ్‌మన్ సుల్తాన్ లామా వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంచు, కొండచరియలు విరిగిపడి నదులు ఉప్పొంగడంతో ఈ విపత్తు సంభవించినట్లు సమాచారం. సకాలంలో వచ్చిన హెచ్చరికను సీరియస్‌గా తీసుకుని వేగంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజేంద్ర దవాడీ పెను విషాదాన్ని నివారించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!