

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో జరిగిన అగ్ని ప్రమాదం, శిశువుల మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనకు సంబంధించి ఎస్‌ఎన్‌సీయూ వార్డులోని విద్యుత్ వ్యవస్థ, అగ్నిప్రమాద హెచ్చరిక వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర తరలింపు విధానం, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రమాదంలో పలువురు నవజాత శిశువులు మృతి చెందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో ఉన్న భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రిమ్స్ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు, విద్యుత్, అగ్నిమాపక, భవన భద్రతా తనిఖీలకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!