

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలు, ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ ఘటనలను ఖండిస్తూ హైదరాబాద్‌లో పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సంఘీభావ సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని, ఘటనపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన ఘటన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, దాదాపు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలతో నిరసన తెలిపారు. త్వరలో ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!