
టెక్నాలజీ

నేపాల్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో భారత్ తన సహాయక చర్యలను కొనసాగిస్తోంది. 11 టన్నుల అత్యవసర సామగ్రితో నాలుగో విమానాన్ని నేపాల్‌కు పంపింది. గత ఐదు రోజుల్లో భారత్ మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని అందించినట్లు సమాచారం. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, రెస్క్యూ కార్యకలాపాలకు అవసరమైన మద్దతును భారత్ అందిస్తోంది.
రెస్క్యూ కార్యక్రమాల్లో సహకరించేందుకు భారత సాంకేతిక బృందాన్ని నేపాల్‌కు పంపింది. అలాగే బాధితులను గుర్తించే ప్రక్రియలో సహాయపడేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా తరలించింది. మౌలిక వసతుల పునరుద్ధరణలో భాగంగా వంతెనల నిర్మాణానికి అవసరమైన సామగ్రితో 16 ట్రక్కులను పంపించింది. సంక్షోభ సమయంలో నేపాల్‌కు భారత్ అందిస్తున్న సహాయం కొనసాగుతుండటం రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!