

కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఎడమవైపు ఇంజిన్ పనిచేయకుండా పోయింది. ఈ విమానంలో 224 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం అందించారు. దీంతో చెన్నై విమానాశ్రయ అధికారులు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించి, అవసరమైన అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు.
విమానాశ్రయంలో అత్యవసర బృందాలను అప్రమత్తం చేసి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇంజిన్ వైఫల్యం ఉన్నప్పటికీ పైలట్లు పరిస్థితిని సమర్థంగా నియంత్రించి రాత్రి సుమారు 11:37 గంటలకు విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా దించారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్ వైఫల్యానికి గల కారణాలపై తదుపరి పరిశీలన జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!