

యాపిల్ ఈసారి తన ఐఫోన్ విడుదల విధానంలో కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రెండ్‌ఫోర్స్ సప్లై చైన్ పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణ ఐఫోన్ 18, ఇతర వేరియంట్లను 2027 ప్రారంభంలో తీసుకురావచ్చని సమాచారం. ఈ నెల 9న రాత్రి 10:30 గంటలకు ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ పేరుతో యాపిల్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమంలో ఏ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ఏ20 ప్రో చిప్‌ను తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. టీఎస్‌ఎంసీ 2 నానోమీటర్ తయారీ ప్రక్రియతో ఈ చిప్‌ను రూపొందించే అవకాశం ఉందని ట్రెండ్‌ఫోర్స్ తెలిపింది. దీంతో పనితీరు, బ్యాటరీ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మెరుగైన మెమరీ ప్యాకేజింగ్, కొత్త సీ2 సెల్యులార్ మోడెమ్, పెద్ద బ్యాటరీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రధాన కెమెరాలో మెకానికల్ వేరియబుల్ అపెర్చర్‌ను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఆసక్తిని పెంచుతోంది.
ధరల పెరుగుదల కూడా ఈసారి కీలక అంశంగా మారే అవకాశం ఉంది. మెమరీ ధరలు భారీగా పెరగడంతో ప్రీమియం ఐఫోన్ మోడళ్ల తయారీ వ్యయం పెరిగిందని ట్రెండ్‌ఫోర్స్ అంచనా వేసింది. దీంతో ఐఫోన్ 18 ప్రో ధరలు సుమారు 10–20 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. భారత్‌లో ఖచ్చితమైన ధరలపై ఇంకా స్పష్టత లేదు. డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని, డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ వివరాలపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!