
జనరల్

బీచ్ షాక్స్ ఏర్పాటుపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వం కొనసాగించదని, అవసరమైతే నిలిపివేస్తామని స్పష్టం చేశారు. విశాఖలో అమలు చేస్తున్న బీచ్ షాక్స్ ప్రాజెక్టు ప్రస్తుతం పైలెట్ దశలో మాత్రమే ఉందని ఆమె తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు పెంచడం అని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌కు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సీఎం సూచనల మేరకు ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగుతామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!