

తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల కోసం నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. సుమారు రూ.5.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు 99.5 శాతం పూర్తయ్యాయి. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
ఈ స్టేషన్‌లో 450 మీటర్ల పొడవైన హై-లెవల్ ప్లాట్‌ఫారమ్, ఐదు ప్లాట్‌ఫారమ్ షెల్టర్లు, వెయిటింగ్ హాల్, టికెట్ బుకింగ్ కౌంటర్లు, తాగునీటి సౌకర్యం, మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, విశాలమైన పార్కింగ్ స్థలం, మల్లన్న స్వామి వైభవం మరియు స్థానిక ప్రకృతి అందాలను ప్రతిబింబించే మ్యూరల్ పెయింటింగ్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడనుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!