

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ నేత అబ్దుల్ ముఖీత్ చందాను ప్రత్యేకంగా అభినందించారు. తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించి, అనాథలు మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల విద్య కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించడం ప్రశంసనీయమని అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లో తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్ సయ్యద్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి విద్యకు ఆర్థిక సహాయం అందించనున్నారు. వ్యక్తిగత వేడుకలను సామాజిక సేవకు అనుసంధానం చేసిన అబ్దుల్ ముఖీత్ చందా కుటుంబ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!