
క్రీడలు

బీహార్‌లో జరిగిన నీట్ పరీక్షలో భారీ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు విద్యార్థుల బదులుగా పరీక్ష రాసేందుకు ఏడుగురు నకిలీ అభ్యర్థులను రంగంలోకి దించిన ‘సాల్వర్ గ్యాంగ్’ను పోలీసులు గుర్తించారు. ఈ అక్రమానికి పాల్పడిన ముఠా ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందితో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయోమెట్రిక్ సంస్థకు చెందిన 14 మంది ఉద్యోగులతో పాటు మొత్తం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన పేపర్ లీక్, పరీక్షల అక్రమాల కేసుల్లో కూడా ఈ గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!