

పనామా జెండాతో ప్రయాణిస్తున్న భారీ కార్గో నౌక ‘ఎంవీ ఓషన్ విన్నర్’ బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో మునిగిపోయింది. పారాదీప్ పోర్టు నుంచి ఇనుప ఖనిజంతో సింగపూర్ వైపు బయలుదేరిన ఈ నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 మంది చైనా, ముగ్గురు మయన్మార్, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. ఆగస్టు 22న నౌకతో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం నౌక మునిగిపోయినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా భారీ గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి. నౌకాదళానికి చెందిన నిఘా విమానం సముద్రంలో లైఫ్ రాఫ్ట్‌లను గుర్తించగా, సమీపంలో ఉన్న ‘ఎంటీ ఐసోపస్’ వాణిజ్య నౌకను సహాయక చర్యలకు మళ్లించారు. రెండు లైఫ్ రాఫ్ట్‌ల నుంచి ఇద్దరు సిబ్బందిని రక్షించి వైద్య సాయం అందిస్తున్నారు. మిగిలిన 22 మంది కోసం కోస్ట్‌గార్డ్‌కు చెందిన ‘వరాద్’, ‘అన్మోల్’, ‘విజిత్’ నౌకలతో గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కా



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!