

బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. కంగనాతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, ఇప్పటివరకు ఇద్దరూ ముఖాముఖిగా కలుసుకోలేదని చెప్పారు. తన అభిప్రాయాలు, ఆలోచనా విధానం తన పెంపకాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందిస్తూ.. తన తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యాన్ని వివాదంలోకి తీసుకురావడం సరికాదని అన్నారు. తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన పోస్టులను కొద్దిసేపటికే తొలగించారు. అప్పటికే వాటి స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగనా–తాప్సీ మధ్య వివాదానికి 2019లోనే బీజం పడగా, 2020లో బాలీవుడ్ నెపోటిజం చర్చ సందర్భంగా కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మరోవైపు తాప్సీ మాత్రం తాను కంగనాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదని పలుమార్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాప్సీ నటించిన ‘గాంధారి’ సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!