

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, విద్యార్థుల్లో కొందరు సౌండ్ బాక్స్ స్టాండ్‌పైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, వారిలో ఓ విద్యార్థికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణలో భద్రతా చర్యల విషయంలో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో యశ్ తన ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఘటనతో ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ వేడుకపై భద్రతా ఏర్పాట్లకు సంబంధించి చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!