

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్లుగా ఎవరెవరు పాల్గొంటారన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ లాంచ్ ఉండొచ్చన్న ప్రచారం నేపథ్యంలో, ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కామన్ పీపుల్‌కు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2 కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్, నూకరాజు, టెంపర్ వంశీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ పేరు కూడా చేరింది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై సీరత్ కపూర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’లో పాల్గొనడం లేదని తెలిపారు. భవిష్యత్తులో షోలో పాల్గొనే అవకాశం ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని, అప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని ఆమె కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!