
సినిమాలు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి రెండంతస్తుల భవనాన్ని పూర్తిగా ఆవరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల్లో రెండంతస్తుల భవనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!