
జనరల్

హైదరాబాద్‌లో నిర్వహించిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటకు చెందిన ఈ విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందే ప్రణాళిక రచించి ఉదయం 7 గంటల సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకుని, మరుగుదొడ్డి వెంటిలేటర్ ద్వారా మొబైల్ ఫోన్‌ను లోపల ఉంచినట్లు విచారణలో వెల్లడైంది.
పరీక్ష జరుగుతున్న సమయంలో కడుపునొప్పి అంటూ టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థి, అక్కడ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ గూగుల్ క్రోమ్‌లో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నట్లు గుర్తించారు. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!