
జనరల్

అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగానే ఈ విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా భారీగా లాభాలు పొందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ ఏడాది ఇసుక ద్వారా రూ.1,200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల కోసం చట్టం తీసుకువచ్చామని, 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చి ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!