

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్‌పై దాడులకు ఉపయోగించే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇతర సదుపాయాలను తమ ప్రతిదాడులకు చట్టబద్ధమైన లక్ష్యాలుగానే పరిగణిస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. తాజా దాడుల్లో బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌ను డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. అంతకుముందు కువైట్, బహ్రెయిన్‌లోని పలు అమెరికా సైనిక స్థావరాలపైనా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించింది.
మరోవైపు ఈ ఘర్షణ మరింత విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బహ్రెయిన్, కువైట్ యుద్ధ విమానాలు ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు తాజా అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుత ఘర్షణలో ఇరాన్‌పై ఈ రెండు గల్ఫ్ దేశాలు నేరుగా వైమానిక దాడులకు దిగడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. తమ భూభాగాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ పదేపదే క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిచర్య చోటుచేసుకున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో అమెరికా-ఇరాన్ ఘర్షణ ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే ప్రమాదం పెరగడంతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!