

పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కఠిన నిబంధనలతో ‘పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026’ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం సాధారణ పరీక్షల అక్రమాలకు ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల జైలు శిక్షను గరిష్ఠంగా 10 ఏళ్లకు పెంచనున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడిన వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు చేశారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే నిబంధనను ప్రతిపాదించారు.
పరీక్షల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించే ఎగ్జామ్ సర్వీస్ ప్రొవైడర్లకు రూ.5 కోట్ల వరకు జరిమానాతో పాటు ఎనిమిదేళ్ల వరకు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా సవరణలు ప్రతిపాదించారు. పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత మూడు నెలల్లోగా తీర్పు వెలువడేలా చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సవరణలతో పేపర్ లీక్ ముఠాలు, వ్యవస్థీకృత పరీక్షల అక్రమాలపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!