
జనరల్

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం తీవ్ర కలకలానికి దారి తీసింది. బెంగళూరులోని సదాశివనగరలో ఆయన ఇంటి వెనుక జీబీఏ మైదానం ముందు ఉన్న రోడ్డుపై శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
వృత్తాకార ముగ్గులు వేసి, కోడిని కోసి, నిమ్మకాయలు ఉంచి పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సీఎం నివాసం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!