

రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం ₹1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. దేశంలోని ప్రధాన మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మల్కాజిగిరి పరిధిలోని గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తామని, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, పేదలకు గృహ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. నగర పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా వికేంద్రీకరణ చేపట్టినట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!