

కొడంగల్‌లో స్థానిక నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళన (ఎస్‌ఐఆర్) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఓటరు వెరిఫికేషన్ ఫారాన్ని బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌వో)కు అందజేశారు. కొడంగల్ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని పేర్కొన్న ఆయన, అర్హత ఉన్న ప్రతి ఓటరు తన వివరాలను నమోదు చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కొడంగల్ నియోజకవర్గంలో 1,96,620 ఓటర్ల వివరాలు ప్రక్షాళన పూర్తయ్యాయని, ఇంకా 54,635 మంది నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. గడువులోపు ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హ ఓటరిని నమోదు చేయించి, కొడంగల్‌లో 100 శాతం ఓటరు ప్రక్షాళన పూర్తి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!