
సినిమాలు

వీబీజీ రామ్‌జీ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని ఆమె చెప్పారు. వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వీబీజీ రామ్‌జీ పథకాన్ని కొనసాగించాలా లేదా కొత్త పథకాన్ని తీసుకురావాలా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గితేనే వికసిత గ్రామాలు 2047 లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. జల్ సంచార్ విభాగంలో తెలంగాణకు 13 అవార్డులు రావడం రాష్ట్ర పనితీరుకు నిదర్శనమని ఆమె తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!