
జనరల్

కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 3న విశాఖ తీరానికి వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటులో బయలుదేరిన గంటకే వారి ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణంగా పది రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారు ఇళ్లకు చేరుకోలేదు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అల్లవరం మెరైన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మత్స్యకారుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!