
రాజకీయాలు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 7 నుంచి 11 వరకు వరుణ యాగం నిర్వహించనున్నారు. వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్రం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలని, లోకక్షేమం చేకూరాలని ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్, ఈవో తెలిపారు.
ఆగస్టు 7 నుంచి 9 వరకు వరుణ యాగ క్రతువులు, వేదోక్త పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 10న శ్రీ మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం, శ్రీ భ్రమరాంబ అమ్మవారికి నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఆగస్టు 11న పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వాదంతో మహాయాగం ముగియనుంది. సకాలంలో వర్షాలు కురవడం, లోకక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం ఈ ప్రత్యేక మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!