

కోర్సు మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను అదనపు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామంటూ నిలిపివేసిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. విద్యార్థికి రూ.1.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
నాంపల్లికి చెందిన రాకేష్ వర్మ కుమారుడు 2021లో మైసమ్మగూడలోని కాలేజీలో బీటెక్ కోర్సులో చేరి, మొదటి సంవత్సరం ఫీజు రూ.80 వేలు చెల్లించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపాల్సి రావడంతో సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కోరగా, అదనంగా రూ.80 వేలు చెల్లించాలని కాలేజీ డిమాండ్ చేసింది.
దీంతో విద్యార్థి నాలుగేళ్లు నష్టపోయాడు. వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో, కాలేజీ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చింది. అయితే విద్యార్థికి జరిగిన మానసిక క్షోభను గుర్తించిన కమిషన్, 45 రోజుల్లో పరిహారం చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!