

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ అమెరికా గడ్డపై తెలుగు ప్రజలు సాధిస్తున్న అద్భుత విజయాలను ప్రశంసించారు. “నమస్కారం” అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, స్పాన్సర్లు, వాలంటీర్లు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రవాస భారతీయులు ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా మాతృభూమిని మర్చిపోవద్దని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విస్తరించడంలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ మహాసభల్లో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. తొలి రోజు గాయని సునీత ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!