

మల్టీప్లెక్స్‌లు విస్తరించినా, జైపూర్‌లోని రాజ్ మందిర్ థియేటర్ ప్రత్యేక ఆకర్షణను ఇప్పటికీ కోల్పోలేదు. బాలీవుడ్ ప్రముఖులు తమ సినిమాల ప్రచార కార్యక్రమాలకు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్‌ను ఎంచుకోవడం దీని ప్రత్యేకతను చాటుతోంది. తాజాగా నటుడు సన్నీ డియోల్ తన 'బట్వారా 1947' ట్రైలర్ విడుదలకు ఈ థియేటర్‌ను వేదికగా ఎంపిక చేశారు. 1976 జూన్ 1న ప్రారంభమైన ఈ థియేటర్‌ను వజ్రాల వ్యాపారి రాజ్‌మల్ సురానా నిర్మించారు. రాజభవనాన్ని తలపించే నిర్మాణశైలి, అద్భుతమైన ఇంటీరియర్స్, పరిశుభ్రత, అత్యాధునిక సౌకర్యాలతో ఇది దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన సినిమా హాళ్లలో ఒకటిగా నిలిచింది.
సుమారు 1,300 మంది ఒకేసారి సినిమా వీక్షించే సామర్థ్యం, విలాసవంతమైన సీటింగ్, ఖరీదైన షాండ్లియర్లు, ఆటోమేటిక్ కర్టెన్, ఎయిర్ కండిషనింగ్, అద్భుతమైన కళాత్మక అలంకరణలు ఈ థియేటర్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. సాధారణ బాల్కనీ, అప్పర్ క్లాస్‌లకు బదులుగా పెర్ల్, రూబీ, ఎమరాల్డ్, డైమండ్ వంటి రత్నాల పేర్లతో విభాగాలను ఏర్పాటు చేశారు. దీవార్, డాన్, నసీబ్, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, రామ్ తేరీ గంగా మైలీ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఇక్కడ ఘన విజయాన్ని సాధించాయి. 'ప్రైడ్ ఆఫ్ ఆసియా', 'సినిమా దేవాలయం'గా పేరొందిన రాజ్ మందిర్ నేటికీ సినీ అభిమానులు, పర్యాటకులు తప్పక సందర్శించే ప్రదేశంగా కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!