

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు మరో భారీ పాన్ ఇండియా కథ వినిపించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజమౌళి దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ దర్శకుడు అజిత్‌ను కలిసి కథ చెప్పినట్లు సమాచారం. కథలోని కాన్సెప్ట్, స్థాయి అజిత్‌కు నచ్చడంతో పూర్తి వివరాలతో మరోసారి కథ వినాలని ఆయన ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. వెంటనే సినిమా ప్రారంభమయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అజిత్ అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.
ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’పై అజిత్ దృష్టి పెట్టారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత వీరి కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత వెంకట్ ప్రభుతో సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘మంకథ’ విజయం నేపథ్యంలో ఆ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. మరోవైపు అజిత్ రేసింగ్ ప్రయాణంపై ‘గ్లాడియేటర్స్’ రూపొందుతోంది. రాజమౌళి టీమ్‌కు చెందిన దర్శకుడి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!