

బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ఈ సినిమా తెలుగు విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 15న తెలుగు టీజర్ విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అది జరగలేదు. దీంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.
తాజాగా ఈ సినిమా తెలుగు విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ నెల 18న విడుదల కావాల్సిన ‘హనుమాన్ అంశ్’ వాయిదా పడినట్లు ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. హిందీలో ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!