
సినిమాలు

‘ఏక్ దిన్’ చిత్రంలో ఇటీవలే ప్రేమికురాలిగా కనిపించిన సాయిపల్లవి, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. త్వరలో విడుదల కానున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీత పాత్రలో కూడా ఆమె కనిపించనుంది.
తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్‌గా ‘ధనుష్ 55’గా పిలుస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కూడా మరో కథానాయికగా నటిస్తోంది.
సాయిపల్లవి పాత్ర పూర్తిగా యాక్షన్ ప్రధానంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత సినిమాలకు భిన్నంగా శక్తివంతమైన పోలీస్ పాత్రలో ఆమె కొత్త అవతారంలో కనిపించనుందని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!