

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందనున్న ఏఏ23 చిత్రంపై కొత్త ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఉండదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ, కథకు అనుగుణంగా మహిళా ప్రధాన పాత్రను పూర్తిగా తొలగించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
'ఖైదీ', 'విక్రమ్' తరహాలో యాక్షన్‌కు పెద్దపీట వేస్తూ రా అండ్ రస్టిక్ స్టైల్లో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. బలమైన కథనం, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో లోకేష్ కనగరాజ్ మరో ప్రత్యేక చిత్రాన్ని అందించనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రీకరణలో బిజీగా ఉండగా, అది పూర్తైన అనంతరం ఏఏ23 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!