

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ సినిమా షూటింగ్లో 40 శాతం పూర్తైందని వెల్లడించారు. దీంతో చిత్రీకరణ ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని స్పష్టమైంది.
మిగిలిన 60 శాతం చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసి నిర్ణయించిన సమయానికే సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘స్పిరిట్’పై అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!