

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో దర్శకుడు వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు విశ్వంభరపై మరోసారి ఆసక్తిని పెంచాయి. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఆలస్యమైనా థియేటర్లలో భారీ ప్రభావం చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశ్వంభర లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. రాసిపెట్టుకోండి అంటూ వశిష్ఠ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త ట్రీట్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు తాజా పరిస్థితి నిరాశ కలిగిస్తోంది. వశిష్ఠ మాటలను బట్టి ఈ సమయంలో ప్రత్యేక అప్డేట్ ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. విజువల్స్ నాణ్యత విషయంలో రాజీ పడకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులకు భారీ అనుభూతి అందించాలన్నదే చిత్రబృందం లక్ష్యంగా కనిపిస్తోంది. మెగాస్టార్ అభిమానులు కూడా సినిమా నుంచి తదుపరి ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!