
గాసిప్స్

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం ‘సిగ్మా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రబృందం రెండో పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ‘ఓలమ్మో వగలాడి’ పేరుతో రూపొందిన ఈ పాటను నేడు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు యువన్ శంకర్ రాజా చేతుల మీదుగా ‘ఓలమ్మో వగలాడి’ సెకండ్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ పాట అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!