

సూపర్ స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో, ఎంఎస్ రాజు నిర్మించిన ఈ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌కు 4కే టెక్నాలజీతో కొత్త మెరుగులు దిద్దారు. రాధా మాధవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ ఈ చిత్రాన్ని జూన్ 26న తిరిగి విడుదల చేస్తున్నారు. 2003లో విడుదలైన ఈ చిత్రం మహేశ్‌బాబు, భూమిక కెరీర్‌లలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
ఇప్పటికే పలుమార్లు రీ-రిలీజ్ అయినప్పటికీ ‘ఒక్కడు’పై ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తాజా 4కే వెర్షన్‌తో సినిమా విజువల్స్ మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ, ప్రతి తరం ప్రేక్షకులను అలరిస్తూ ‘ఒక్కడు’ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!