

సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. సినిమాలో సమంత నటనకు ప్రశంసలు దక్కుతుండగా, ఆమె స్నేహితురాలు కిరణ్మయి పాత్రలో నటించిన మంజూష ముక్కవిల్లి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆమె కామెడీ టైమింగ్, సహజమైన నటన కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో ఆమె చెప్పిన “లెట్స్ కమాన్” డైలాగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మంజూష ముక్కవిల్లి సోషల్ మీడియాలో తన ప్రత్యేక రీల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ వంటి లెజెండరీ నటీమణుల మేనరిజంలను అనుకరిస్తూ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దర్శకురాలు నందినీ రెడ్డి ఆమె ప్రతిభను గమనించి, సమంత బెస్ట్ ఫ్రెండ్ పాత్ర కోసం మూడు దశల్లో ఆడిషన్ నిర్వహించినట్లు సమాచారం. చివరకు ఎంపికైన మంజూష తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!