

బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, త్వరలో ‘వారణాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నామని, కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం తాము చేసిన కృషిని ప్రపంచ ప్రేక్షకులకు చూపించే అవకాశం లభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో తన కోసం ప్రత్యేకంగా ఎవరూ కథలు రాయలేదని చెప్పారు. అయితే తన కష్టానికి, త్యాగాలకు ఇప్పుడు సరైన గుర్తింపు లభిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం తనకు నచ్చిన కథలు, పాత్రలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని, ఇది తన కెరీర్లో ఎంతో సంతృప్తినిచ్చే దశ అని ప్రియాంక చోప్రా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!