
సినిమాలు

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం డిమాంటీ కాలనీ 3 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అరుళ్నితి మరియు ప్రియాభవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో భయానక క్యాప్షన్‌తో విడుదల తేదీని ప్రకటిస్తూ, “ఈ ప్రదేశం గురించి ఆలోచిస్తే భయం, పీడకలలు వస్తాయి. చీకటి కోసం సిద్ధంగా ఉండండి… డిమాంటీ కాలనీ తలుపులు తెరుచుకోబోతున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుళ్నితి హీరోగా వచ్చిన డిమాంటీ కాలనీ గత రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దీంతో మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భయానక కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను మళ్లీ అలరించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!