

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఒకటి. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నయనతార మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవ్వడం తనకు ఇష్టం లేదని కాదని, అయితే అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో తాను అంతగా నైపుణ్యం కలిగి లేనందుకే సాధారణంగా దూరంగా ఉంటానని చెప్పారు.
‘టాక్సిక్’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పిన నయనతార.. యశ్ విషయంలో ప్రత్యేకంగా స్పందించారు. యశ్ తనకు ఒక్క ఫోన్ కాల్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని అడగడంతోనే తాను హాజరయ్యానని తెలిపారు. యశ్ ఫోన్ చేయడం తనకు ఈ ఈవెంట్‌కు రావడానికి సరిపోతుందని నయనతార చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ‘టాక్సిక్’లో నయనతార ‘గంగా’ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!