
సినిమాలు

హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ చేయించుకోనున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో రేపు ఆయనకు శస్త్రచికిత్స జరగనుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తూ, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకునేలా పర్యవేక్షిస్తోంది.
ఆపరేషన్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరు గురించి ఎప్పటికప్పుడు మీడియా ద్వారా వివరాలు వెల్లడిస్తామని ఆయన టీం తెలిపింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!