

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలకు ముందే ‘పెద్ది’ మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో చాలా మంది ఆశించారని, తాను కూడా అలాంటి వారిలో ఒకరినని తెలిపారు. పెద్ద సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తే ఆ ప్రభావం తర్వాత విడుదలయ్యే ఇతర చిత్రాలపై కూడా సానుకూలంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కొద్ది రోజుల క్రితమే ‘పెద్ది’ సినిమా చూశానని చెప్పిన నందిని రెడ్డి, అందులో రామ్ చరణ్ నటన అద్భుతంగా అనిపించిందని కొనియాడారు. ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని ఎంతో ప్రభావవంతంగా చూపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ పోడియంపై నిలబడి తన ఉంగరాన్ని ముక్కుకు తాకించే సన్నివేశం తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. ఆ సన్నివేశమే కథకు అసలైన ఆత్మగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!