

నిధి అగర్వాల్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరాహ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌లో నిధి ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించడంతో పాటు అదే రోజు చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో నిధి ఒక చేతిలో దీపం పట్టుకుని, మరో చేతితో దానికి రక్షణగా నిలిచినట్లు కనిపించగా, వెనుక అనేక చేతులతో ఉన్న దేవత ఆకృతి ఆసక్తిని పెంచుతోంది.
హీరోయిన్ చుట్టూ తిరిగేలా బలమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో నిధి కనిపించనున్నారని సమాచారం. ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీర మల్లు’ చిత్రాల్లో నిధి నటనకు మంచి స్పందన రావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. వరాహ ఫిల్మ్స్‌కు ఇది తొలి నిర్మాణ చిత్రం కాగా, త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!