

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రంలో త్రుప్తి దిమ్రి కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. త్వరలో చిత్రీకరించనున్న ప్రత్యేక గీతంలో ప్రభాస్‌తో పాటు త్రుప్తి దిమ్రితో మరో బాలీవుడ్ నటి కూడా సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మిస్తున్నారని, ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
యాక్షన్, భావోద్వేగాలు, స్టైలిష్ మేకింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా ప్రతి అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచగా, ప్రభాస్ లుక్కు విశేష స్పందన లభించింది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సంగీత చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథ కూడా పూర్తిగా కొత్త తరహాలో ఉండబోతుందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!