

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఆయన న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘సమ్మిట్ 2026’ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామితో జరిగిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న రామ్ చరణ్, సినిమా రంగంతో పాటు ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
మధ్యతరగతి కుటుంబాలకు సినిమా ఇప్పటికీ అత్యంత చౌకైన వినోద మాధ్యమమని పేర్కొన్న రామ్ చరణ్, మల్టీప్లెక్స్ థియేటర్లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ అదనపు ఖర్చుల కారణంగా చాలామంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. ఆహార పదార్థాల ధరలను తగ్గిస్తే ప్రేక్షకులకు సినిమా అనుభవం మరింత ఆనందదాయకంగా మారుతుందని, థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!