

సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న బలమైన ఆదరణతో టికెట్ అమ్మకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రెండవ ఆదివారం నాడు మాత్రమే ఈ చిత్రం సుమారు 8,000 టికెట్లు అమ్ముకోవడం విశేషం. బుక్‌మైషోలో కూడా భారీగా టికెట్లు బుక్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే రెండేళ్లలో రాబోతుందని ప్రకటించారు. పార్ట్-2 చేయాలనే ఆలోచన తనకు మొదటిసారి ఈ ప్రాజెక్ట్‌తోనే కలిగిందని ఆయన తెలిపారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో కూడా బలమైన కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!